హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీమంత్రి మృతి.. నివాళులర్పించిన మోదీ

కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్. వి. రామచంద్ర గౌడ (88) ఇవాళ బెంగళూరులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. జనసంఘ్ కాలం నుంచి పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన ఆయన మృతికి ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ 'X' వేదికగా నివాళులర్పించారు.