హైదరాబాద్: 28°C
వార్తలు

పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

PLD: జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ, బాపట్ల జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ మంగళవారం నరసరావుపేటలో ఈ నెల 17న సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. సభా ప్రాంగణం, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.