హైదరాబాద్: 28°C
వార్తలు

'కుల వివక్షపై పోరాడదాం'

PLD: ​ముప్పాళ్ళలో దళితులపై కుల వివక్షను రూపుమాపేందుకు ఈనెల 16 నుంచి 26 వరకు సామాజిక శంఖారావం పేరుతో నిర్వహించే సర్వేను జయప్రదం చేయాలని కేవీపీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు సీహెచ్. నాగమల్లేశ్వరరావు కోరారు. నేటికీ దళిత, గిరిజన వాడలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని, నిధుల ఖర్చులో వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.