హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రైనేజీ నీటితో కలుషితమవుతున్న తాగునీరు

TPT: నాగలాపురం రెడ్డి వీధిలో తాగునీటి పైప్‌లైన్‌లో డ్రైనేజీ నీరు కలుస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుళాయిల ద్వారా దుర్వాసనతో కూడిన కలుషిత నీరు వస్తోందని, పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే పైప్‌లైన్ మరమ్మతులు చేపట్టి స్వచ్ఛమైన నీరు అందించాలని కోరుతున్నారు.