హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రపంచ స్ట్రోక్ సంస్థ డైరెక్టర్‌గా వైద్యురాలు

గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు పీ. విజయ ప్రపంచ స్ట్రోక్ సంస్థ (డబ్ల్యూఎస్‌వో) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆసియా-ఓషియానియా ప్రాంతానికి ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు. 2026 నుంచి నాలుగేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తిస్తారు. స్ట్రోక్ వైద్య సేవలు, పరిశోధన, ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఆమె చేసిన కృషికి ఈ అరుదైన గౌరవం దక్కింది.