హైదరాబాద్: 28°C
వార్తలు

'పంటల బీమా నమోదు చేయించుకోవాలి'

GNTR: రావిపాడు, గోగులమూడి గ్రామాల్లో ఖరీఫ్–2026 "పొలం పిలుస్తుంది" కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి సుబ్రమణ్యం మాట్లాడుతూ.. పత్తి పంట బీమా నమోదు గడువు జూలై 15 వరకు ఉందన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటల బీమా రైతులకు రక్షణగా నిలుస్తుందని చెప్పారు. ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారానే ఎరువుల పంపిణీ జరుగుతుందని, ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.