SS: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును ఈనెల 24 వరకు పొడిగించినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఓటరు జాబితాలో సవరణలు చేసుకోవాలని కోరారు.
వార్తలు
'ఓటరు సవరణకు గడువు పెంపు'


