హైదరాబాద్: 28°C
వార్తలు

మైనర్​ డ్రైవింగ్​.. వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు

NZB: జిల్లాలో మైనర్​ డ్రైవింగ్​పై పోలీసులు, ఆర్టీఏ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులకు సంబంధించిన బైక్​ల రిజిస్ట్రేషన్​ను ఏడాది పాటు రద్దు చేస్తున్నారు. రవాణాశాఖ అధికారులు ఇటీవల దూకుడు పెంచారు. జూన్​ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 283 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు.