హైదరాబాద్: 28°C
వార్తలు

త్వరలో RBSK-2.0 ఆరోగ్య పరీక్షలు

తిరుపతి జిల్లాలో 0–18 ఏళ్ల చిన్నారులకు RBSK-2.0 పాఠశాల ఆరోగ్య పరీక్షలు త్వరలో ప్రారంభించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డా. వీ.బాలకృష్ణ నాయక్ తెలిపారు. జిల్లాలో 2.35 లక్షల మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి 38 రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి ఉచిత చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు.