NLG: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ జన్మదినాన్ని పురస్కరించుకుని నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత శాలిగౌరారంలో ఇవాళ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు. సామెల్ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
ఎమ్మెల్యేను సత్కరించిన డీసీసీ అధ్యక్షుడు


