హైదరాబాద్: 28°C
వార్తలు

బోయకొండలో చండీ హోమం

CTR: చౌడేపల్లి మండలం ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో అమావాస్య సందర్భంగా మంగళవారం చండీ హోమాన్ని నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ హోమాన్ని వేద పండితులు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆలయ ఈవో ఏకాంబరం పర్యవేక్షించారు. భక్తులు చండీ హోమంలో పాల్గొన్నారు.