హైదరాబాద్: 28°C
వార్తలు

కాలువల శుభ్రతకు ప్రత్యేక చర్యలు

SRPT: కోదాడ పట్టణంలోని 7వ లైన్‌లో ఉన్న కాలువను 20వ వార్డు కౌన్సిలర్ నాగేశ్వరావు ఆధ్వర్యంలో మంగళవారం జేసీబీతో శుభ్రం చేయించారు. వర్షాకాలంలో నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. కాలువ శుభ్రపరచడంతో స్థానికులకు ఉపశమనం కలిగిందని, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ ఇటువంటి పనులు కొనసాగిస్తామన్నారు.