హైదరాబాద్: 28°C
వార్తలు

బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ

KMR: బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది సుదర్శన్ రావు ఆకస్మిక మృతికి సంతాపంగా బాన్సువాడ బార్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం విధులను బహిష్కరించారు. బాన్సువాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు M.A. ఖలీల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేశారు. సుదర్శన్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అసోసియేషన్ సభ్యులందరూ రెండు నిముషాలు మౌనం పాటించారు.