NLG: నిడమనూరు మండలం వేంపాడు కేజీబీవీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మారాణి తెలిపారు. బైపీసీ, ఎంఎల్‌టీలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అర్హులైన విద్యార్థులు ఈనెల 28న టీసీతో కళాశాలలో హాజరై ప్రవేశాలు పొందాలని సూచించారు.
వార్తలు
కేజీబీవీలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లకు ఆహ్వానం


