HNK: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బీఎల్వోలు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను నేడు సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కోరారు. ఫారాలు సమర్పించడంలో ఆలస్యం చేస్తే ఓటరు జాబితాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఇప్పటికే 3,89,109 ఓటర్ల వివరాల మ్యాపింగ్ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు.
వార్తలు
SIR ఫారాల సమర్పణకు నేడు చివరి అవకాశం: కలెక్టర్


