హైదరాబాద్: 28°C
వార్తలు

పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ

కోనసీమ: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు తాపేశ్వరంలో మిషన్ హరితోదయ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు."ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి", "పచ్చదనమే ప్రగతికి పునాది" వంటి నినాదాలతో ప్రజలకు సందేశం అందించారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంపొందించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.