హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు

MNCL: జన్నారం మండలంలోని రోతర్రేకు చెందిన కే.దేవురావుకు వైద్య చికిత్సలు అందించి ఎస్సై ఉదయ్ కిరణ్, హెచ్సీలు దేవన్న, నీలయ్య మంచి మనసు చాటుకున్నారు. దేవురావు రాత్రి మూర్చ వచ్చి పడిపోగా ఆయనను వారు లక్షెట్టిపేట ఆసుపత్రిలో చికిత్స చేయించడంతో కోలుకున్నాడు. దేవురావ్ వద్ద రూ.1.08 లక్షలు ఉండడం గమనించి ఎస్సై మంగళవారం సర్పంచ్ బోడ శంకర్ సమక్షంలో ఆ నగదును అందజేశారు.