హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ పార్కులో గంజాయి సాగు కలకలం

మహారాష్ట్రలో ప్రభుత్వ పార్కులో గంజాయి సాగు చేయటం కలకలం రేపింది. నాగ్‌పూర్ గజానన్ పార్కులో గంజాయి మొక్కల పెంపకం చేయడాన్ని స్థానికులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను  బీజేపీ నేత మున్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంజాయి సాగుపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.