హైదరాబాద్: 28°C
వార్తలు

'కొడుకుపై కేసును తండ్రిపై ఎలా నమోదు చేస్తారు?'

మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసును జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇద్దరిపై భిన్నమైన ఆరోపణలు ఉన్నప్పుడు ఒకే కేసుగా భావించి కొడుకుపై ఉన్న కేసునే తండ్రిపై ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించింది. చట్టంలో ఈ అవకాశం ఉందా? దౌర్జన్యం కేసును రద్దు చేసి లైంగిక దాడి కేసుగా విచారించడం సరైనదేనా అని నిలదీసింది.