హైదరాబాద్: 28°C
వార్తలు

సునేత్రా పవార్‌కు బిగ్‌ షాక్‌

మహారాష్ట్ర రాజకీయాల్లో అధికార నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్జీ జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ ఎన్నికైన విధానాన్ని సవాల్ చేస్తూ పార్టీ సీనియర్ నాయకుడు సచ్చిదానంద్ లీగల్ నోటీసు పంపించారు. అధ్యక్ష ఎన్నిక చెల్లదని, పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ ప్రక్రియ నిర్వహించారని ఆరోపిస్తూ.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.