హైదరాబాద్: 28°C
వార్తలు

సీతారామపురం: చెరువు మట్టి యథేచ్చగా అక్రమ రవాణా

NLR: సీతారామపురం చెరువు మట్టిని అక్రమంగా యథేచ్చగా తరలిస్తున్నారు. వ్యవసాయ భూములకు వినియోగించాల్సిన సారవంతమైన మట్టిని ప్లాట్ల చదును, ఇటుక బట్టీల కోసం జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.