BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం నిత్యకళ్యాణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని, భక్తిపారవశ్యంతో పునీతులయ్యారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
వార్తలు
వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకళ్యాణం


