AP: అమరావతిలో ఓ కృత్రిమ 'రెయిన్ ఫారెస్ట్'ను సృష్టించనున్నారు. శాఖమూరు పార్కులోని ఐదెకరాల్లో 'మినీ అమెజాన్'ను ఏర్పాటు చేయబోతున్నారు. 20 వేలకుపైగా చెట్లు, మొక్కలతో దట్టమైన అడవిని సృష్టించనున్నారు. రెయిన్ ఫారెస్ట్‌లో మిస్ట్ గార్డెన్, రెయిన్ వాక్‌వే వంటివి ఏర్పాటు చేయనున్నారు. నిరంతరం వర్షం కురుస్తున్నట్లు అనుభూతి కలిగేలా రెయిన్ గన్స్‌ను వినియోగించనున్నారు.
వార్తలు
అమరావతిలో 'మినీ అమెజాన్'


