హైదరాబాద్: 28°C
వార్తలు

42 మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!

రైల్వే శాఖకు సంబంధించిన పలు హెక్టార్ల భూమి కబ్జాకు గురైనట్లు రైల్వే బోర్టు వెల్లడించింది. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 1,068.54 హెక్టార్ల భూమి ఆక్రమణదారుల చేతుల్లో వెళ్లిందని చెప్పింది. భారత రైల్వేస్‌కు 4.99 లక్షల హెక్టార్ల భూమి ఉండగా అందులో దాదాపు 0.21 శాతం భూమి కబ్జాకు గురైనట్లు తెలిపింది. ఈ భూమితో 42 అహ్మాదాబాద్ నరేంద్రమోదీ స్టేడియాలను నిర్మించవచ్చని అంచనా.