హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులను పరిశీలించిన బల్దియా కమిషనర్

WGL: వరంగల్ నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని బల్దియా కమిషనర్ టి. వెంకన్న మంగళవారం పరిశీలించారు. హనుమకొండ, వరంగల్ పరిధిలోని ఎస్టీపీ ప్లాంట్లు, ఇంటిగ్రేటెడ్ వెజ్–నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీపీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.