GDWL: గద్వాల మున్సిపాలిటీలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న దౌలన్న (దౌలు) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దౌలన్న అకాల మరణం పట్ల మున్సిపల్ అధికారులు, తోటి సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
వార్తలు
మున్సిపల్ అటెండర్ దౌలన్న మృతి


