ప్రైవేట్ పాఠశాలలకు పంజాబ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫీజు నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించి తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన ఫీజులను తిరిగి వారికి చెల్లించాలని తెలిపింది. నగదు ఇవ్వలేని పక్షంలో ఆ మొత్తాన్ని విద్యార్థుల ఫీజుల్లో తగ్గించుకోవాలని సూచించింది. ఈ ఆదేశాలు పాటించని పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. దీనిపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు


