హైదరాబాద్: 28°C
వార్తలు

జయంతిరాయపురం గ్రామ సమీపంలో ఏనుగుల సంచారం

PPM: సీతానగరం (M) జయంతిరాయపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్టు ఎలిఫెంట్ మోనటరింగ్ అధికారులు మంగళవారం ఉదయం తెలిపారు. పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. వన్యప్రాణులను రెచ్చగొట్టే చర్యలు కాని కవ్వింపు చర్యలు చేపడితే ఎదురు దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.