హైదరాబాద్: 28°C
వార్తలు

గవర్నర్ వ్యాఖ్యలకు కంగనా సపోర్ట్

కుటుంబం కోసం మహిళలు వంట నేర్చుకోవాలన్న యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సమర్థించింది. పిల్లలను పెంచడం, పోషించడం మహిళలకు సహజంగానే వస్తుందని పేర్కొంది. చిన్నతనంలో తన సోదరుడు ఆటలాడుతుంటే, తాను బొమ్మల ఇళ్లు కడుతూ కాలక్షేపం చేసేదాన్నని గుర్తుచేసుకుంది. మహిళల్లోని ఈ సహజ శక్తి వల్లే వారిని దేవి, అన్నపూర్ణగా కొలుస్తారని కంగనా అభిప్రాయపడింది.