హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. వ్యక్తి అరెస్ట్

యూపీ ఆగ్రాలో రోడ్లు బాలేవని వీడియో చేస్తూ సీఎం యోగిని 'తక్లా' (బట్టతల) అని దూషించిన రఫీక్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంతల రోడ్లను చూపిస్తూ ఇదేనా అభివృద్ధి అంటూ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి లాకప్‌లో వేశారు. కాగా నిన్న లాకప్‌లో నుంచి చేతులు జోడించి 'తప్పు జరిగింది, క్షమించండి, ఇకపై వీడియోలు చేయను' అని ఖాన్ వేడుకున్నాడు.