ASF: భూముల రీ సర్వేతో భవిష్యత్తులో భూవివాదాలు తగ్గుతాయని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత తెలిపారు. డీజీపీఎస్, రోవర్స్ సాంకేతికతతో శాస్త్రీయంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో 37, రెండో విడతలో 70 గ్రామాలను ఎంపిక చేశామన్నారు. దీనివల్ల రైతుల పొలాల గట్ల వివాదాలు, రెవెన్యూ-అటవీ భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
వార్తలు
భూ వివాదాలకు రీ సర్వేతో పరిష్కారం: కలెక్టర్


