హైదరాబాద్: 28°C
వార్తలు

పోయిన మొబైల్స్ బాధితులకు సీఐ అందజేత

VZM: కొత్తవలస పోలీస్ స్టేషను పరిధిలో ఇటీవల నలుగురు వ్యక్తులు వారి మొబైల్స్ పోగొట్టుకున్నారు. బాధితులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సిఈఐఆర్ యాప్ ద్వారా మొబైల్స్ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. యాప్ ద్వారా మొబైల్స్ లభ్యమవడంతో బాధితులకు సమాచారం ఇచ్చి సీఐ టి.వి.విజయకుమార్ సోమవారం అందజేశారు. మొబైల్స్ లభ్యమవడంతో పోలీసులకు అభినందనలు తెలిపారు.