హైదరాబాద్: 28°C
వార్తలు

సరిహద్దులో యూఎస్ మాజీ సైనికుడి పట్టివేత

అక్రమ మార్గంలో నేపాల్‌లోకి ప్రవేశించడానికి యత్నించిన 36 ఏళ్ల అమెరికా పౌరుడిని యూపీలోని ఇండో-నేపాల్ సరిహద్దులో సైనికులు అరెస్ట్ చేశారు. నిందితుడు కారిఫోర్నియాకు చెందిన జోర్డాన్ బ్రౌన్‌గా గుర్తించారు. గతంలో US సైన్యంలో పని చేసినట్లు నిందితుడు తెలిపినట్లు అధికారులు చెప్పారు. మాజీ సైనికాధికారి అక్రమంగా నేపాల్‌లోకి వెళ్లేందుకు యత్నించడంపై దర్యాప్తు చేస్తున్నారు.