హైదరాబాద్: 28°C
వార్తలు

మై భారత్‌తో యువతకు కొత్త అవకాశాలు

KNR: కరీంనగర్‌లో మై భారత్ జిల్లా అడ్వైజరీ, సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే జిల్లాలో కొత్త యూత్ క్లబ్‌ల ఏర్పాటు, గ్రామీణ యువతను సంఘటితం చేసి యువజన కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు. మై భారత్ పోర్టల్‌లో యువత అధిక సంఖ్యలో నమోదు చేసుకుని ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.