కడప జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు సోమవారం 109 కేసులు నమోదు చేశారు. ఉల్లంఘనలకు గాను రూ.28,065 జరిమానా విధించినట్లు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వార్తలు
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై 109 కేసులు


