TG: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కాలేజీల బంద్ నిర్వహిస్తున్నట్లు ABVP ప్రకటించింది. రూ.12వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సర్కారు తీరుకు నిరసనగా జూనియర్ కాలేజీల నుంచి యూనివర్సిటీల వరకు బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని కోరింది.
వార్తలు
నేడు కాలేజీల బంద్‌కు ఏబీవీపీ పిలుపు


