హైదరాబాద్: 28°C
వార్తలు

గుడ్‌న్యూస్.. ఈనెల 20 తర్వాత వర్షాలు!

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. బంగాళాఖాతం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు 7,000-10,000KM పొడవుతో ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్(ITCZ) విస్తరించిందని తెలిపింది. దీనివల్ల వెచ్చని, తేమతో కూడిన గాలులు పైకి ఎగసి భారీ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని, ఈనెల 20-30 మధ్య వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.