తిరుమలలో రేపు శ్రీవారి కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 17న ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని శుద్ది చేయనున్నారు. ఏడాదిలో నాలుగుసార్లు ఆలయ శుద్ది చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి, ఉగాదికి ముందు మంగళవారం, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలకు ముందు మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం చేపడుతారు.
వార్తలు
రేపు శ్రీవారి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం


