హైదరాబాద్: 28°C
వార్తలు

9 మంది మృతి.. ఆరుగురి గల్లంతు

పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ ప్రాంతంలో మత్స్యకారుల పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లా దిఘా నుంచి 15 మందితో వేటకు వెళ్లిన ఈ పడవ జూలై 4న కనిపించకుండా పోయింది. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు తొమ్మిది మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.