హైదరాబాద్: 28°C
వార్తలు

'BDL కంపెనీకి మా భూములు ఇవ్వం'

ప్రకాశం: దొనకొండ (M) ఇండ్లచెరువు పంచాయతీలో బీడీఎల్ కంపెనీ కేటాయించిన తమ భూములను తాముఇచ్చే ప్రసక్తేలేదని దొనకొండ MROకు రైతులు వినతిపత్రం సమర్పించారు. 120 కుటుంబాలు సాగుచేసుకునే పొలాలు BDL కంపెనీకి ఇస్తే తాము భూములు కోల్పోయి జీవనాధారం లేకుండా పోతామని వాపోయారు. తమకు ఉన్న ఈ కొద్ది భూమి సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, కంపెనీకి మరోచోట భూమి కేటాయించాలని ఎమ్మార్వోని కోరారు.