CTR: చౌడేపల్లె బోయకొండ గంగమ్మ ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు చేపట్టారు. 54 రోజులకు రూ. 1.25 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. 43.95 గ్రాముల బంగారు, 550 గ్రాముల వెండి హుండీలో భక్తులు కానుకలుగా వేసినట్లు ఆయన చెప్పారు. అన్నదానం వద్ద హుండీలో రూ. 22 వేలు, రణభేరి గంగమ్మ ఆలయంలో రూ. 96 వేల ఆదాయం చేకూరిందన్నారు.
వార్తలు
బోయకొండ గంగమ్మ హుండీ ఆదాయం ఎంతంటే?


