హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థినుల వేధింపులు అరికట్టేందుకు 'శక్తి టీం'

ELR: ఎన్.ఆర్.ఐ కాలేజీ వద్ద విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిలపై ఏలూరు టౌన్ 'శక్తి టీం' ఆకస్మిక దాడి నిర్వహించింది. బస్సు స్టాపుల వద్ద అసభ్యంగా ప్రవర్తిస్తూ, కేకలు వేస్తున్న పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టూ-టౌన్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ సమక్షంలో పట్టుబడిన ఆకతాయిలకు కఠిన హెచ్చరికలు జారీ చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు.