హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ మంత్రి ఓటు గల్లంతు.. కలెక్టరుకు ఫిర్యాదు

AP: తన ఓటు గల్లంతయ్యిందంటూ మాజీ మంత్రి అరుణ గుంటూరు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. 45 ఏళ్లుగా గుంటూరులో ఓటు వేస్తున్నా, మాజీ మంత్రిని, నా ఓటు లేకపోవడం ఏంటని అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు-1, గుంటూరు-2 రెండు చోట్లా ఓటరు జాబితాలో తన పేరు కనిపించలేదన్నారు. మ్యాపింగ్ పేరుతో వచ్చి నోటీసు కూడా తనకు ఇవ్వలేదని ఆరోపించారు. ఓటరు జాబితాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.