హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్సై

MLG: ములుగు పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా నియమితులైన ఎస్. వెంకటేష్ సోమవారం జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామ్‌నాథ్, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ములుగులో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. ప్రజా భద్రతకు అంకితభావంతో పనిచేస్తానని ఎస్సై వెంకటేష్ తెలిపారు.