కృష్ణా: పెడన మండలం పెనుమల్లి గ్రామంలో అక్రమంగా మట్టి రవాణా కొనసాగుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లు గ్రామంలోని పాఠశాల సమీపంలో అధిక వేగంతో సంచరిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ము, శబ్ద కాలుష్యంతో పాటు ప్రమాదాల ముప్పు పెరిగిందని వారు పేర్కొంటున్నారు.
వార్తలు
పాఠశాల మార్గంలో దూసుకెళ్తున్న మట్టి ట్రాక్టర్లు


