హైదరాబాద్: 28°C
వార్తలు

విమాన టికెట్‌ ధరలు.. కేంద్రం నివేదిక కోరిన సుప్రీం

విమాన టికెట్ ధరలకు సంబంధించి సుప్రీంకోర్టు.. కేంద్రం నుంచి నివేదికను కోరింది. రెండు వారాల్లో సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. దేశంలో విమాన ఛార్జీలు, అనుబంధ రుసుములలోని భారీ హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త లక్ష్మీనారాయణన్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు తాజాగా నివేదికను కోరుతూ ఆదేశాలిచ్చింది.