చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ ఒకేసారి ఐఐటీ మద్రాస్‌లో చదివిన తల్లీకుమారులు వార్తల్లో నిలిచారు. జిగీశ అనే మహిళ తన కుమారుడు ఆదిత్యతో కలిసి ఐఐటీ మద్రాస్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో వీరిద్దరూ ఒకే వేదికపై కలిసి పట్టాలు అందుకోవడం విశేషం. ఈ అరుదైన ఘటన అక్కడి వారందరినీ ఆకట్టుకుంది.
వార్తలు
తల్లీకుమారులు.. ఒకేసారి ఐఐటీ పట్టా


