హైదరాబాద్: 28°C
వార్తలు

కర్ణాటక ఆలయాల్లో హుండీలకు భద్రత పెంపు

దేశంలోని పలు దేవాలయాల విరాళాల్లో అవకతవకలు జరుగుతున్నట్లు వార్తలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విరాళాల లెక్కింపు కేంద్రాలు, హుండీల వద్ద నిరంతర నిఘా కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు మరిన్ని కఠినమైన భద్రతా చర్యలు చేపట్టింది.