హైదరాబాద్: 28°C
వార్తలు

సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన

NTR: జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, గంపలగూడెం మండలం పెద్దకోమిరలోని విశిష్ట కాలేజీలో గత శనివారం సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరువూరు సీఐ కె. గిరిబాబు మాట్లాడుతూ, విద్యార్థులు అపరిచిత లింకులు క్లిక్ చేయవద్దని, ఓటీపీలు పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని కోరారు.