హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యారంగ సమస్యలు పరిష్కరించాలీ'

ADB: జిల్లా వ్యాప్తంగా నెలకొన్న విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇచ్చోడ మండల విద్యాశాఖ అధికారి బిక్కును సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రైవేటు పాఠశాలలో ఫీజులు నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. అనుమతి లేని పాఠశాలల రద్దు, పలు అంశాలను పరిష్కరించాలని కోరారు.